మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామానికి చెందిన మేడి అఖిల్ హత్య కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు టెక్నికల్ టీమ్ సహకారంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించి...
– హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సెల్ఫోన్లు స్వాధీనం
లక్ష్మిదేవిపల్లి, అక్టోబర్ 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామానికి చెందిన మేడి అఖిల్ హత్య కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు టెక్నికల్ టీమ్ సహకారంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించి కేసును ఛేదించినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ అఖిల తన సిబ్బందితో కలిసి కొత్తగూడెం బస్‌స్టాండ్ సమీపంలో నిందితులు దంత్యాల గణేష్ అలియాస్ గని, సిరిపురం సాత్విక్ అలియాస్ చిన్సు, ముద్దంగుల వెంకటేష్ అలియాస్ చిన్ని, తరాల ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. గతంలో జరిగిన గొడవలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ప్రధాన నిందితులుగా పేర్కొన్న గణేష్, సాత్విక్‌లు అఖిల్‌పై పగ పెంచుకుని హత్యకు పథకం రచించారు. ఇందులో భాగంగా మద్యం తాగిస్తామని నమ్మించి అఖిల్‌ను ఎదురుగడ్డ గ్రామంలోని రేకుల షెడ్డు సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. 19.10.2026 తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గణేష్ కత్తితో అఖిల్ మెడపై పలుమార్లు పొడిచి, సిమెంట్ ఇటుకతో ముఖంపై దాడి చేయగా, సాత్విక్ కూడా సిమెంట్ ఇటుకతో దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ దాడిలో అఖిల్ మృతి చెందాడు. ఈ హత్యకు సంబంధించి మిగిలిన నిందితులు సైతం ముందస్తు పథకంలో భాగంగా సహకరించినట్లు, మద్యం కొనుగోలు తదితర అవసరాల కోసం ఫోన్‌పే ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు విచారణలో గుర్తించారు. నిందితుల వద్ద నుండి మూడు సెల్ఫోన్లు, ఫోన్ పే లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్షాట్లను పోలీసులు రికవరీ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ.. వ్యక్తిగత కక్షలు, పాత గొడవల కారణంగా హింసాత్మక చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకొని నేరాలకు పాల్పడవద్దని, సమస్యలు తలెత్తినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. నేరాలకు పాల్పడిన వారు ఎంతకాలం పరారీలో ఉన్నా సాంకేతిక ఆధారాలు, పోలీసుల దర్యాప్తు ద్వారా గుర్తించి చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.ఈ కేసులో నిందితుల పాత్ర, ఆర్థిక లావాదేవీలు, ఇతరుల ప్రమేయం తదితర అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో టెక్నికల్ టీమ్ సహకారం కీలకంగా నిలిచిందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
‘గర్భిణులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి’
Mercedes hit-and-run: మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీసు కమీషనర్ బదిలీ
Ramayana | ‘రామాయణ’ చూసి ఆశ్చర్యపోయా.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’తో పోల్చిన హాలీవుడ్ విమర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

