‘గర్భిణులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి’
పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని సిబ్బంది హాజరు పట్టికను, ఓపీ (OP) రికార్డులను పరిశీలించారు. అనంతరం వార్డులు, ల్యాబొరేటరీ, ఫార్మసీ...
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్
– పెనగడప పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
చుంచుపల్లి, అక్టోబర్ 28 : పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని సిబ్బంది హాజరు పట్టికను, ఓపీ (OP) రికార్డులను పరిశీలించారు. అనంతరం వార్డులు, ల్యాబొరేటరీ, ఫార్మసీ, మందుల నిల్వ కేంద్రాన్ని పరిశీలించి సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. ప్రస్తుత తుఫాను వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, డెలివరీ తేదీ సమీపిస్తున్న గర్భిణుల (EDD cases) వివరాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా గర్భిణులకు ఇబ్బంది కలగకుండా తగిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని, సురక్షిత ప్రసవాలకు సిద్ధంగా ఉండాలని సిబ్బందికి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రామంలో నమోదవుతున్న జ్వరాల కేసులు, అందుబాటులో ఉన్న చికిత్స వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రజలకు నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గర్భిణులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి’
Mercedes hit-and-run: మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీసు కమీషనర్ బదిలీ
Ramayana | ‘రామాయణ’ చూసి ఆశ్చర్యపోయా.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’తో పోల్చిన హాలీవుడ్ విమర్శకుడు!
Avengers Dooms day | మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఒక రోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’!
UP MLC: వారణాసి ఎమ్మెల్సీ సీటు సమాజ్‌వాదీ పార్టీ వశం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

