లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవు
అధికార కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా చేసిన విమర్శలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లురవి సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మణరేఖ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
- రాజగోపాల్, అనిరుధ్ వ్యాఖ్యలు పెద్దల దృష్టికి
- ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడితో చర్చించాం
- వారిపై చర్యలు తప్పవని మల్లు రవి సంకేతాలు
అచ్చంపేట, నవంబర్ 22 : అధికార కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా చేసిన విమర్శలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లురవి సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మణరేఖ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మల్లు రవి మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వ పనితీరుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న అంశాన్ని పార్టీ పెద్దలు తన దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించారు.
దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్జి సందీప్ దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణ, నిర్ణయాలకు భిన్నంగా ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా భవిష్యత్‌లో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

