Ramayana | ‘రామాయణ’ చూసి ఆశ్చర్యపోయా.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’తో పోల్చిన హాలీవుడ్ విమర్శకుడు!
Ramayana | భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’పై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా ప్రపంచ ప్రీమియర్ లాస్ ఏంజెలెస్‌లో బుధవారం ఉదయం భారత కాలమానం ప్రకారం జరిగింది.
Ramayana | భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’పై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా ప్రపంచ ప్రీమియర్ లాస్ ఏంజెలెస్‌లో బుధవారం ఉదయం భారత కాలమానం ప్రకారం జరిగింది. చిత్ర బృందంతో పాటు పలువురు అంతర్జాతీయ సినీ విమర్శకులు ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. సినిమా ఇంగ్లిష్ వెర్షన్‌ను వీక్షించిన ఓ విమర్శకుడు చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2001లో విడుదలైన ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సినిమా చూసినప్పుడు కలిగిన అద్భుతమైన అనుభూతి, ఇప్పుడు ‘రామాయణ’ చిత్రాన్ని చూసినప్పుడు మరోసారి కలిగిందని ఆ అంతర్జాతీయ విమర్శకుడు పేర్కొన్నారు. ఈ కామెంట్స్ సినిమా తనపై ఎంతటి ప్రభావం చూపిందో తెలియజేస్తోంది. ముఖ్యంగా భగవాన్ శ్రీరాముడి పాత్రను తెరపై ఆవిష్కరించిన తీరును ఆయన ప్రశంసించారు. అయితే, ప్రస్తుతం సినిమా పూర్తి సమీక్షలను ప్రచురించడంపై ఆంక్షలు ఉండటంతో కథ, నటీనటుల ప్రదర్శన, సాంకేతిక అంశాలపై ఆయన పెద్దగా స్పందించలేదు. రివ్యూలపై ఆంక్షలు తొలగిన తర్వాతే తన పూర్తి అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.
‘రామాయణ’ తొలి భాగం ముగింపు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటుందని కూడా ఆ విమర్శకుడి స్పందన ద్వారా తెలుస్తోంది. సినిమా చివర్లో తెర నల్లగా మారినప్పుడు తాను ఆశ్చర్యంతో గట్టిగా అరిచానని ఆయన పేర్కొన్నారు. ఈ ముగింపు రెండో భాగంపై ఆసక్తిని మరింత పెంచేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తన పూర్తి సమీక్షను ఆదివారం ప్రచురిస్తానని, అప్పటికి సమీక్షలపై ఉన్న ఆంక్షలు తొలగుతాయని ఆయన తెలిపారు. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీత పాత్రలో, యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, యశ్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ చూసి ఆశ్చర్యపోయా.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’తో పోల్చిన హాలీవుడ్ విమర్శకుడు!
Avengers Dooms day | మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఒక రోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’!
UP MLC: వారణాసి ఎమ్మెల్సీ సీటు సమాజ్‌వాదీ పార్టీ వశం
Ponnam Prabhakar | ఢిల్లీ నిరసనలకు ప్రత్యేక రైళ్లు కావాలని కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పొన్నం, ఎంపీ రఘురాం రెడ్డికి అస్వస్థత
Husharu 2 | నక్సలైట్ నాయకుడిగా ఆర్. నారాయణమూర్తి.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హుషారు 2’ టీజర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

