Mercedes hit-and-run: మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీసు కమీషనర్ బదిలీ
Mercedes hit-and-run: మెర్సిడీజ్ కారు హిట్ అండ్ రన్ కేసులో దర్యాప్తు లోపాలు ఉన్నట్లు కేరళ హోంశాఖ పేర్కొన్నది. దీంతో కొచ్చి సిటీ పోలీసు కమీషనర్ కాళీరాజ్ మహేశ్ కుమార్‌ను బదిలీ చేశారు. ఆ కేసులో మరో నలుగురు పోలీసుల్ని సస్పెండ్ చేశారు.
కొచ్చి: కేరళలోని కొచ్చి సిటీ పోలీసు కమీషనర్ కాళిరాజ్ మహేశ్ కుమార్‌ను బదిలీ చేశారు. మరో నలుగురు పోలీసుల్ని సస్పెండ్ చేశారు. చారనల్లూరులో జరిగిన మెర్సిడీజ్ కారు ప్రమాదం(Mercedes hit-and-run)లో దర్యాప్తు లోపాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కేరళ సర్కారు కొచ్చి సిటీ కమీషనర్‌ను బదిలీ చేసింది. జిల్లా అదనపు జడ్జీకి చెందిన 17 ఏళ్ల కుమారుడు మెర్సిడీజ్ కారును డ్రైవ్ చేస్తూ 55 ఏళ్ల స్కూటర్ రైడర్‌ను ఢీకొట్టాడు.ఆ ప్రమాదంలో రైడర్ మృతిచెందాడు. అయితే ఈ కేసు విచారణలో కొచ్చి పోలీసు కమీషనర్ నిర్లక్ష్యం వహించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. మహేశ్ కుమార్ స్థానంలో ఆర్ నిషాంతిని నియమించారు. దక్షిణ ప్రాంత ఐజీగా పీ ప్రకాశ్‌ను నియమించారు. రాష్ట్ర హోంశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.
వీధి వ్యాపారం చేస్తున్న జయబాలకృష్ణన్ రాత్రి 2.20 నిమిషాలకు బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మెర్సిడీజ్ ఢీకొట్టింది. తొలుత నిర్లక్ష్యం కేసు బుక్ చేశారు. ఆ తర్వాత ఓవర్‌స్పీడింగ్ కేసు పెట్టారు. మెర్సిడీజ్ కారు రిజిస్ట్రేషన్ టీనేజర్ తండ్రి పేరుమీద ఉన్నది. టీనేజర్‌ను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రజెంట్ చేయగా, అతడికి బెయిల్ మంజూరీ చేశారు. ఆ బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక రిపోర్టు ప్రకారం టీనేజర్ మద్యం మత్తులో లేరని రాశారు. అతని రక్త నమోనాలను సేకరించారు. డీజీపిని హోంమినిస్టర్ మందలించడంతో.. క్రైం బ్రాంచ్ ఆధారాలను సేకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes hit-and-run: మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీసు కమీషనర్ బదిలీ
Ramayana | ‘రామాయణ’ చూసి ఆశ్చర్యపోయా.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’తో పోల్చిన హాలీవుడ్ విమర్శకుడు!
Avengers Dooms day | మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఒక రోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’!
UP MLC: వారణాసి ఎమ్మెల్సీ సీటు సమాజ్‌వాదీ పార్టీ వశం
Ponnam Prabhakar | ఢిల్లీ నిరసనలకు ప్రత్యేక రైళ్లు కావాలని కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పొన్నం, ఎంపీ రఘురాం రెడ్డికి అస్వస్థత
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

