Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indrareddy | హిమాయత్ సాగర్ వద్ద మూసీ పనులు చేస్తామని అంటున్నారు.. అసలు హిమాయత్ సాగర్‌లో నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి..? రేవంత్ రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
Sabitha Indrareddy | నీళ్లు తెద్దామంటే చుక్క నీళ్లు లేవు.. కొందామంటే కరెంట్ లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని.. అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంట్ ఎంత ఖర్చు పెట్టైనా కొన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 3.70-3.90 రూపాయల పెట్టి పవర్ కొంటే అదేమో అవినీతి అని ఎంక్వైరీ వేశారు. మరి ఈ రోజు 12 రూపాయలైనా దొరకుతలేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు.. ముందు చూపు లేకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ప్రజల పట్ల బాధ్యత లేకుండా ప్రభుత్వాన్ని, పాలన గాలికొదిలేసి తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా దృష్టి పెట్టి కన్నెపల్లిలో ఉన్న నీళ్లను ఎత్తిపోయండి అని చెప్పినా.. ఇప్పటికీ పెడచెవిన పెడుతున్నాడు.
మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కిందికి నీళ్లను వదిలేస్తుంటే.. పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం ఏమో ఒడిసిపట్టుకొని 750 టీఎంసీల నీటిని గోదావరి నుంచి 250 టీఎంసీల నీళ్లను కృష్ణా నుంచి రాజేసి.. తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన 1000 టీఎంసీల నీటిని కిందికి వదిలేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది, ప్రభుత్వానిది.. ఈ రోజు మూసీ అంటున్నారు.. మూసీకి నీటిని ఎక్కడి నుంచి తెస్తరని ప్రశ్నించారు. రైతులకేమో ఖర్చు పెట్టేందుకు డబ్బులు లేవు.. కానీ మూసీ మీద ఖర్చు పెట్టేందుకు మీ మీద రూ.లక్షా 40 వేల కోట్లు మీ దగ్గర ఉన్నయి.. ఏం ఉపయోగం మూసీ వల్ల.. ఇప్పుడు అర్జెంట్‌గా ఎందుకు చేయాలని ప్రశ్నించారు. హిమాయత్ సాగర్ వద్ద మూసీ పనులు చేస్తామని అంటున్నారు.. అసలు హిమాయత్ సాగర్‌లో నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి..? చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజల పట్ల బాధ్యత లేకుండా, ముందుచూపు లేకుండా పాలనను గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు
కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఒక్క క్షణం కూడా కరెంట్ పోవొద్దని యూనిట్‌కు రూ.3.90 పెట్టి కొంటే అందులో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి అన్నాడు
ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి రూ.12 పెట్టినా కరెంట్ దొరకడం లేదని అంటున్నాడు
తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన 1000 టీఎంసీల నీళ్లు రేవంత్ రెడ్డి కిందికి వదిలేస్తే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ల ప్రాజెక్టులకు తీసుకెళ్లాడు
మూసీ ప్రాజెక్టును అర్జెంట్‌గా పూర్తి చేయాల్సిన అవసరం ఏముంది?
ఒకవైపు రైతులు కష్టాల్లో ఉన్నారు వాళ్ల కోసం ఆ డబ్బులను ఖర్చు చేయాల్సింది పోయి మూసీ ప్రాజెక్టుకు ఎందుకు పెడుతున్నారు?
హిమాయత్ సాగర్ వద్ద మూసీ పనులు చేస్తామని అంటున్నారు.. అసలు హిమాయత్ సాగర్‌లో నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి?
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) October 28, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
‘గర్భిణులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి’
Mercedes hit-and-run: మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీసు కమీషనర్ బదిలీ
Ramayana | ‘రామాయణ’ చూసి ఆశ్చర్యపోయా.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’తో పోల్చిన హాలీవుడ్ విమర్శకుడు!
Avengers Dooms day | మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఒక రోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

