నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని యాదాద్రి భువనగిరి జెడ్పీ మాజీ చైర్మన్, వనపర్తి ఇన్చార్జి ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. నాటి ఉద్యమస్ఫూర్తితో మన పార్టీ శ్రేణులలో ఉత్సాహం నిం పుతూ కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్ధానాలపై పోలడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్ర భుత్వంలో చెప్పిన హామీలన్ని మరుగున పడ్డాయని, కాంగ్రెస్ అంటేనే ప్రజలు విసుగెత్తి పో యారన్నారు. ప్రస్తుతం జనం నేడు కేసీఆర్‌వైపు చూస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమన్నారు.
నాయకు లు, ఉద్యమ స్ఫూర్తితో దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని సందీప్ రెడ్డి పిలుపునిచ్చారు. కాగా, దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా వనపర్తిలో చేపట్టాల్సిన కార్యక్రమాలను ఒక్కొక్కరికీ బాధ్యతలను మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అప్పగించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, పట్టణపార్టీ అధ్యక్షుడు రమేశ్ గౌ డ్, నాయకులు కురుమూర్తి యాదవ్, నందిమళ్ల అశోక్, విశ్వేశ్వర్, కృష్ణా నాయక్, రఘుపతిరెడ్డి, వనం రాములు, విజయ్, జాత్రు నాయక్, ఉస్మాన్, సేనాపతి, టీక్యా నాయక్ పాల్గొన్నారు.