హుస్నాబాద్, అక్టోబర్ 31: మొంథా తుపా ను కారణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతినడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, ప్రభు త్వం నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధప్రాతిపదికన నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణ శివారులో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటనష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, సైదాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో తుపాను కారణంగా పంటలు, రోడ్లు, ఇండ్లకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
భీమదేవరపల్లిలో 42సెంటీమీటర్ల వర్షం ఏకకాలంలో పడిండడంతో భారీగా నష్టం జరిగిందన్నారు. పంట లు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం సరికాదన్నారు. ఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు పోతారం గ్రామానికి చెందిన మహిళా రైతు తారవ్వకు వెంటనే పంట డబ్బులు పడేలా మంత్రి కృషి చేయడం హర్షణీయమని, ఇలాంటి నష్టపోయిన రైతులందరికీ సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని కోరారు. గ్రామాల్లో ఐకేపీ సెంట ర్లు, రైతుల కల్లాల్లో పోసుకున్న ధాన్యం సైతం పూర్తిగా తడిసి ముద్దయ్యిందని, ఈ ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసేలా మంత్రి పొన్నం చర్యలు తీసుకోవాలని కోరారు.
నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా మొత్తం నలుగురు మృతిచెందడం బాధాకరం అన్నారు. మృతుల్లో భీమదేవరపల్లికి చెందిన దంపతులు కల్పన, ప్రణయ్, ఇదే మండలం కొత్తపల్లికి చెందిన అప్పటిన నాగేంద్ర, అక్కన్నేపట మండలం మల్లంపల్లికి చెందిన పుల్లూరు రామకృష్ణ ఉన్నట్లు చెప్పా రు. వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం అందేలా బీఆర్ఎస్ అండగా ఉండి ఆందోళనలు చేస్తుందని ఆయన తెలినారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.