యుద్ధప్రాతిపదికన నష్టం అంచనా వేయాలి
మొంథా తుపా ను కారణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతినడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, ప్రభు త్వం నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధప్రాతిపదికన నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ డిమాండ్ చేశారు.
- దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ఎకరాకు రూ.25వేల పరిహారం చెల్లించాలి
- మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
- మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
- హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ డిమాండ్
హుస్నాబాద్, అక్టోబర్ 31: మొంథా తుపా ను కారణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతినడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, ప్రభు త్వం నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధప్రాతిపదికన నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణ శివారులో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటనష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, సైదాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో తుపాను కారణంగా పంటలు, రోడ్లు, ఇండ్లకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
భీమదేవరపల్లిలో 42సెంటీమీటర్ల వర్షం ఏకకాలంలో పడిండడంతో భారీగా నష్టం జరిగిందన్నారు. పంట లు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం సరికాదన్నారు. ఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు పోతారం గ్రామానికి చెందిన మహిళా రైతు తారవ్వకు వెంటనే పంట డబ్బులు పడేలా మంత్రి కృషి చేయడం హర్షణీయమని, ఇలాంటి నష్టపోయిన రైతులందరికీ సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని కోరారు. గ్రామాల్లో ఐకేపీ సెంట ర్లు, రైతుల కల్లాల్లో పోసుకున్న ధాన్యం సైతం పూర్తిగా తడిసి ముద్దయ్యిందని, ఈ ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసేలా మంత్రి పొన్నం చర్యలు తీసుకోవాలని కోరారు.
నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా మొత్తం నలుగురు మృతిచెందడం బాధాకరం అన్నారు. మృతుల్లో భీమదేవరపల్లికి చెందిన దంపతులు కల్పన, ప్రణయ్, ఇదే మండలం కొత్తపల్లికి చెందిన అప్పటిన నాగేంద్ర, అక్కన్నేపట మండలం మల్లంపల్లికి చెందిన పుల్లూరు రామకృష్ణ ఉన్నట్లు చెప్పా రు. వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం అందేలా బీఆర్ఎస్ అండగా ఉండి ఆందోళనలు చేస్తుందని ఆయన తెలినారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

