 
                                                            రాయపోల్ : మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్రావు(Harish Rao ) తండ్రి సత్యనారాయణ ఇటీవల మరణించిన విషయం విధితమే. శుక్రవారం ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి మోహన్ రెడ్డి హైదరాబాదులోని హరీష్రావు నివాసం వెళ్లి పరామర్శించి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన వెంట రాయపోల్ మాజీ సర్పంచ్ కమ్మరి శ్రీనివాస్ చారి, నాయకులు బాసం నరసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, దశమంత రెడ్డి, తదితరులు ఉన్నారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో..
మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావును పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ మరణించిన విషయం విధితమే. శుక్రవారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కలిసి హైదరాబాద్ కోకాపేటలోని హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. హరీశ్ రావును ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పాండు, షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
 
                            