నిజామాబాద్ : యూరియా యాప్ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళనకు దిగారు. రైతులు, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ మంత్రి నేతృత్వంలో జాతీయ రహదారిపై నేతలంతా కలిసి బైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతుల ఉసురు పోసుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త తరహా యూరియా పంపిణీ వ్యవస్థను తీసుకువచ్చిందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. దుకాణాల్లో లేని యూరియా బస్తాలు యాప్ ద్వారా ఎలా రైతులకు అందుతాయని ప్రశ్నించారు. యాప్ వల్ల గ్రామాల్లో రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.