మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 11: ప్రజల గుండెలో సుస్థిరస్థానం సంపాదించిన వ్యక్తుల పేర్లను బ్యానర్లో చించి పైశాచిక ఆనందం పొందుతారే తప్పా.. ప్రజల గుండెల్లో నుంచి తన పేరును అంత ఈజీగా తొలగించలేరని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లో వడ్డెర సంఘం నాయకులు ఏర్పాటు చేసిన వడ్డె ఓబన్న విగ్రహా న్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథులుగా హా జరై ఆవిష్కరించారు. అయితే వడ్డెర సంఘం నాయకులు విగ్రహావిష్కరణ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
కొందరు ఓర్వలేక శ్రీనివాస్‌గౌడ్ ఫొటోను బ్యానర్లో నుంచి చించివేశారు. ఈ విషయాన్ని గమనించిన బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి దృష్టికి తీసుకురా గా.. పైవిధంగా స్పందించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన శిల్పారామం, ట్యాంక్‌బండ్, రోడ్లు, వెయ్యి పడకల దవాఖాన, అభివృద్ధి పను లు ప్రజలకు కనిపిస్తున్నాయని, పైశాచిక ఆనందం పొందడానికే మీరు ఇలాంటి దుర్బుద్ధి పనులు చేస్తున్నారని మం డిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కుల సంఘాల తో పాటు వడ్డెర సంక్షేమ సంఘానికి భవన నిర్మాణానికి స్థలంతో పాటు నిధులను మంజూరు చేశామని గుర్తు చేశా రు. స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పాలన్నారు. సమాజ హి తం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని, ఓబ న్న విగ్రహం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు నర్సింహులు, యాదయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.