నవాబుపేట్ : వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం మూలమాడ గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని, కిష్టయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( Sabitha Indra Reddy ) , వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ( Anand ) పరామర్శించారు.
సర్పంచ్ ఎన్నికల్లో తమకు సహకరించలేదన్న కోపంతో కక్ష పెంచుకొని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ సభ్యులు , సర్పంచ్ మామ , మాజీ సర్పంచ్ సుభాన్ రెడ్డిని, ఆయన అనుచరుడైన కిష్టయ్యను , ఆయన భార్యను చితక బాదారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. దైర్యంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజురోజు మితిమీరి పోతున్నాయని ఆరోపించారు. గ్రామాల్లోనూ శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.