సూర్యాపేట, ఫిబ్రవరి 2: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అరాచకాలను జనం చూస్తున్నారని, అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని వారికి అర్థమైందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్‌రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలెప్పుడూ మరవలేదని, మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని అన్నారు. సూర్యాపేటకు చెందిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ కట్కూరి కార్తీక్‌రెడ్డి, 27వ వార్డు మాజీ కౌన్సిలర్ సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు, సిరివెళ్ల శబరి, 17వ వార్డుకు చెందిన వందలాది మంది కార్యకర్తలతో సోమవారం పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పెంచి పోషించేది రౌడీయిజం, పందులు, దోమలేనన్నారు. అందుకే ప్రజలు ఆలోచన చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
నాడు 30 ఏళ్లు మూసీ మురికి నీటిని తాగించింది కాంగ్రెస్సేనని, ఎట్లున్న సూర్యాపేటను ఎట్లా అభివృద్ధి చేసినమో ప్రజలకు తెలుసన్నారు. పదేళ్లలో సూర్యాపేట ప్రశాంతంగా ఉందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరికీ అర్థమైందని అందుకే భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఇస్లావత్ రాం చందర్ నాయక్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, గండూరి ప్రకాశ్, నిమ్మల శ్రీనివాస్, మారిపెద్ది శ్రీనివాస్, కక్కిరేణి నాగయ్య, బూర బాలసైదులు, బొమ్మగాని శ్రీనివాస్, కక్కిరేణి సత్యనారాయణ, పల్స వెంకన్న, జీడి భిక్షం, గాలి సాయి తదితరులు పాల్గొన్నారు.