కవాడిగూడ, మే 20 : సీఎం రేవంత్‌రెడ్డికి కాంట్రాక్టుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. డీఎస్సీ, గురుకుల, మాడల్స్కూల్స్, జేఎల్, డీఎల్, ఎస్ఐ, గ్రూప్స్, జీపీవో, పవర్‌సెక్టార్ తదితర రంగాల్లో వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అస్మా ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల ఆవేదన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా గెల్లు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి క్యాబినెట్లో 20వేల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ జేఏసీ చేపట్టే ఉద్యమానికి బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నటు తెలిపారు.