వెంగళరావునగర్, మే 20 :కుర్చీ మడతపట్టి అనే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కుర్చీ తాత అలియాస్ షేక్ మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా(64) బుధవారం మృతిచెందారు. వరంగల్‌కు చెందిన కాలా పాషా 50 ఏండ్ల క్రితం నగరానికి వచ్చి రహ్మత్ నగర్లో స్థిరపడ్డారు. మహేష్‌బాబు సినిమాలోని కుర్చీని మడతపెట్టి.. సాంగ్ ప్రాచుర్యం పొందింది. ఓ యూట్యూబ్ ఇంటర్వూలో తన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణను తెలుపుతూ కుర్చీని మడతపెట్టి అనే పదాన్ని వాడారు. ఆ తదుపరి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
దీంతో మహేష్‌బాబు గుంటూరు కారం సినిమాలో పాషానే కుర్చీని మడతపెట్టి అనే పదాన్ని పాడటం జరిగింది. ఈ పాట సంచలనం సృష్టించింది. అయితే మద్యానికి బానిసైన పాషా చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యారు. రోజూ యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ వద్ద తిరుగుతూ ఉంటారు. బుధవారం ఎండ తీవ్రతకు తట్టుకోలేక కృష్ణకాంత్ పార్క్ వద్ద స్పృహతప్పి పడిపోయారు. తోటివారు వారి కుటుంబసభ్యులకు తెలియజేయగా రహ్మత్ నగర్ వీడియోగల్లీలోని తన ఇంటికి తీసుకెళ్లాక మృతిచెందారు. ఆయన మృతికి సోషల్మీడియో ఇన్‌ఫ్లూయర్స్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.