5G Budget Smart Phones | దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఇటీవలే 5జీ వేలం పూర్తయింది. భారతీ ఎయిర్టెల్ ఈ నెలలో 5జీ సేవలు ప్రారంభించనున్నది. రిలయన్స్ జియో ఈ నెల 15న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. 5జీ హైస్పీడ్ సర్వీసు పొందాలంటే 5జీ స్మార్ట్ ఫోన్ అవసరం. ఈ నేపథ్యంలో సామాన్యుల బడ్జెట్లోనే ఐదు 5జీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. శక్తిమంతమైన బ్యాటరీ సామర్థ్యం.. ప్రాసెసర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఆ ఫోన్లేమిటో చూద్దామా..!
మోటో జీ51 ఫోన్ 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తున్నది. ట్రిపుల్ రియల్ కెమెరాలు (50ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ), 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫీచర్లు జత చేశారు. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. సింగిల్ చార్జితో రోజంతా వాడుకోవచ్చు. 480+ సాక్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.12,249.
రూ.15 వేలలోపు ధరలో పొకో ఎం4 ప్రో బెస్ట్ ఫోన్. ఇది మూడు స్టోరేజీ వేరియంట్లలో లభ్యం అవుతుంది. 4జీబీ + 64జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.12,499, 6జీబీ + 128జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.14,499లకు లభిస్తుంది. ఇక 8జీబీ + 128జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.16,499 పలుకుతున్నది. ఈ ఫోన్ 6.6 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 50ఎంపీ + 8ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వసతులున్నాయి. మీడియా టెక్ డైమెన్షన్ 810 ప్రాసెసర్‌తోపాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.
రియల్ మీ నార్జో-30 5జీ ఫోన్ 6.5 అంగుళాల స్క్రీన్, 90హెర్ట్జ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్‌తో వస్తున్నది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్, 48 ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం అవుతుంది. 4జీబీ ప్లస్ 64జీబీ వేరియంట్ రూ.14,999, 6జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ రూ.16,999లకు అందుబాటులో ఉన్నాయి.
రెడ్మీ నోట్ 10టీ 5జీ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యం అవుతుంది. 4జీబీ ప్లస్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ రూ.11,999, 6జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజీ మోడల్ ఫోన్ రూ.13,999 పలుకుతుంది. ఇందులో 48 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్స్‌టీ 700 సాక్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
శ్యామ్‌సంగ్ గెలాక్సీ-ఎం13 5జీ ఫోన్లో ఎంటీకే డీ 700 ఓక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 50 ఎంపీ, 2 ఎంపీ డ్యుయల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫ్రంట్‌లో 5 ఎంపీ కెమెరా అమర్చారు. 6.5 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్.