Fire accident : జీడిమెట్ల పారిశ్రామి వాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. నాలుగు ఫైరింజన్లు, ఆరు వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
మధ్యాహ్నం నుంచి ఆరు గంటలుగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నా ఇప్పటికి మంటలు అదుపు కాలేదు. ఘటనా స్థలంలో పరిస్థితిని జీడిమెట్ల సీఐ, బాలనగర్ ఏసీపీ పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని పోలీసులు తెలిపారు. అయితే భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
Massive Fire Erupts in Hyderabad’s Jeedimetla Industrial Area
A plastic bag manufacturing unit engulfed in flames
Firefighting teams are working tirelessly to extinguish the blaze#Hyderabad #Jeedimetla #fireaccident pic.twitter.com/ISXW7gQgfz
— Hyderabad Mail (@Hyderabad_Mail) November 26, 2024
Breaking: Massive fire breaks out in a plastic bag manufacturing unit in Hyderabad’s Jeedimetla industrial area. Firefighters are on-site battling the flames. No casualties reported yet.
#hyderabad pic.twitter.com/tcy9nHVCiA— BBN Channel (@bbnnewshyd) November 26, 2024