లింగాల ఘణపురం : లింగాల ఘణపురం మండలంలోని బండ్లగూడెంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం(Fire accident) జరిగింది. చెరువు సమీపంలోని బెస్త శ్రీశైలం వ్యవసాయ బావి ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనితో ఆ ప్రాంతాల్లోని బీడు పొలాల్లోకి మంటలు వ్యాపించాయి. బెస్త శ్రీశైలం తన ఆవులను ఆ ప్రాంతంలోని కొట్టంలో కట్టివేశాడు. మంటలు ఆ ప్రాంతానికి చేరుకుంటుండగా.. అటుగా వెళ్లిన గీతా కార్మికులు గమనించి ఆ ప్రాంతంలోని రైతులకు సమాచారం అందించారు.
దీంతో రైతులు గీత కార్మికులు కలిసి వ్యవసాయ బావి పంపు నీళ్లతో మంటలను రెండు గంటలు శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో నాలుగో ఆవులు మంటలకు ఆహుతి కాకుండా కాపాడగలిగారు. ఆ ప్రాంతంలోని రైతులు, గీత కార్మికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో మూగజీవాలు ప్రాణాలతో బయటపడ్డాయి. కార్యక్రమంలో రైతులు పడిద రాశేఖర్, గట్ట గళ్ళ అనిల్, నోముల శ్రీశైలం, బోయిని కుమార్, తదితరులు పాల్గొన్నారు.