పెన్పహాడ్, జనవరి 10 : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సహకారంతో నిరుపేద కుటుంబాలకు
ప్రభుత్వ సహాయ నిధి నుండి శనివారం ఆర్థిక సాయం చేయడం జరిగింది. పెన్పహాడ్ మండలం లింగాల గ్రామంలో మామిడి వెంకన్న తండ్రి నాగయ్యకు రూ.20 వేలు, అలాగే గుండు సతీశ్ తండ్రి మట్టయ్య రూ.15 వేల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు యేసు, రాజు, దుర్గయ్య, పార్టీ కార్మిక విభాగం మండలాధ్యక్షుడు రణపంగా సైదులు, ప్రధాన కార్యదర్శి రణపంగా జానయ్య, వార్డు మెంబర్ గుండు సంధ్య సతీశ్, నల్లపు రవి కిశోర్ , నాయకులు మామిడి శ్రీధర్ గౌడ్, మామిడి సైదులు, లొడంగి రవి, గుండు మణిదీప్, ఎడవెల్లి ఉపేందర్ రెడ్డి, నల్లపు హరిబాబు, బత్తిని అశ్వద్ధామ, నూకల వెంకన్న, గుండు సందీప్, మామిడి నవీన్ పాల్గొన్నారు.