UPWW vs GGW : భారీ ఛేదనలో యూపీ వారియర్స్(UP Warriorz) బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ కిరణ్ నవ్గరే(1) ఔటైనా ఫొబే లిచ్‌ఫీల్డ్(50 నాటౌట్)తో కలిసి కెప్టెన్ మేగ్ లానింగ్(30) ఇన్నింగ్స్ నిర్మించింది. కానీ, వరేహం వేసిన ఒకే ఓవర్లో లానింగ్, హర్లీన్ డియోల్(0) వెనుదిరిగారు. ఆ తర్వాతి ఓవర్లోనే దీప్తి శర్మ(1) రేణుకా సింగ్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో.. 74 పరుగులకే యూపీ వారియర్స్ నాలుగు కీలక వికెట్లు పడ్డాయి.
డీవై పాటిల్ మైదానంలో 208 పరుగుల ఛేదనకు దిగిన యూపీ వారియర్స్‌కు ఆదిలోనే షాకిచ్చింది రేణుకా సింగ్. డేంజరస్ ఓపెనర్ కిరణ్ నవగరే()ను ఔట్ చేసి గుజరాత్ జెయింట్స్‌కు బిగ్ బ్రేకిచ్చింది. ఆ తర్వాత ఫొబే లిచ్‌ఫీల్డ్(50 నాటౌట్), మేగ్ లానింగ్()లు ధనాధన్ ఆడుతూ స్కోర్ బోర్డును నడిపించారు. అయితే.. వరేహం ఒకే ఓవర్లో లానింగ్, హర్లిన్ డియోల్(0)ను వెనక్కి పంపి యూపీని కష్టాల్లోకి నెట్టగా.. ఆ తర్వాత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(1)ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపింది రేణుక.
Timber 🎯
Renuka Singh Thakur’s first wicket in @Giant_Cricket colours 🧡
Updates ▶️ https://t.co/0Vl9vFyTyq#TATAWPL | #KhelEmotionKa | #UPWvGG pic.twitter.com/evkrimu5Yy
— Women’s Premier League (WPL) (@wplt20) January 10, 2026
అంతే.. చూస్తుండగానే మూడు బిగ్ వికెట్లు పడ్డాయి. 74కే 4 వికెట్లు పడినవేళ క్రీజులోకి వచ్చిన శ్వేతా షెహ్రావత్(17 నాటౌట్) తొలి బంతినే సిక్సర్‌గా మలవగా స్కోర్ 80 దాటింది. ఆ తర్వాత గార్డ్నర్ ఓవర్లో రెండు ఫోర్లు, సింగిల్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకుంది లిచ్‌ఫీల్డ్. నేనేమీ తక్కువా అని షెహ్రావత్ 4, 6 బాదేయగా స్కోర్ వంద దాటింది. 11 ఓవర్లకు యూపీ స్కోర్..102-4. ఇంకా విజయానికి 48 బంతుల్లో 106 పరుగులు కావాలి.