Mana Shankara Varaprasad Garu | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినివ్వడంతోపాటు ప్రీమియర్ షోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.
మన శంకరప్రసాద్గారు టీంకు ఊహించని షాక్ తగిలింది. మన శంకరప్రసాద్గారు టికెట్ ధరల పెంపుపై పిటిషన్ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. టికెట్ ధరలు పెంచడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్దంగా ధరలు పెంచుతున్నారంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించింది. కోర్టు పని దినాల్లో మాత్రమే పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. హైకోర్టు సెలవు తర్వాత విచారిస్తామని చెప్పడంతో న్యాయవాది విజయ్ గోపాల్ మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.
జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి..
జనవరి 11న తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతినిచ్చింది. ఈ షో టికెట్ ధరను రూ. 600గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ ప్రీమియర్ షోలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 చొప్పున అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
2026 Sankranthi heroines | ఈ సంక్రాంతికి టాలీవుడ్లో లక్ పరీక్షించుకోబోతున్న భామలు వీళ్లే..!