రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా మొదటి రోజు వసూళ్లపై చిత్రబృందం తాజాగా స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ఈ సినిమా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 112 కోట్ల (Gross) మార్కును దాటేసి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, మరియు కల్కి చిత్రాల తర్వాత ప్రభాస్ ఖాతాలో చేరిన ఆరో రూ. 100 కోట్ల ఓపెనర్ ఇది. దీంతో ఇండియాలో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించారు. తెలుగు రాష్ట్రాలలో రూ. 58 కోట్ల వసూళ్లను సాధించగా.. కర్ణాటక & ఇతర రాష్ట్రాలలో రూ. 18 కోట్లు, ఓవర్సీస్లో రూ.36 కోట్లు రాబట్టినట్లు సమాచారం.
A new benchmark has been set with KING SIZE BOX OFFICE domination across every fort 🔥🔥#TheRajaSaab 𝐃𝐚𝐲 𝟏 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐬𝐭𝐚𝐧𝐝𝐬 𝐚𝐭 𝟏𝟏𝟐𝐂𝐫+ 💥
Biggest start ever for a horror fantasy film ❤️🔥#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi… pic.twitter.com/vonsA0Nj53
— The RajaSaab (@rajasaabmovie) January 10, 2026