దేవరకొండ, జనవరి 10 : సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చందంపేట మండలం యాపలపాయ తండాకు చెందిన కేతావత్ రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాట్రావత్ రాజు నాయక్ నియమక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు కాట్రావత్ రాజు నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేశ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రజలకు సేవ చేయడానికి తగినంత సమయం కేటాయించి ప్రచార్ సమితి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ ప్రచార కార్యదర్శి సభావత్ గోవిందు నాయక్, నేరేడుగొమ్ము మండలాధ్యక్షుడు ఆంజనేయులు, కొర్ర శంకర్ నాయక్ పాల్గొన్నారు.