Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Farmers Protest | నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండల రైతాంగానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం మహాధర్నా నిర్వహించారు.
నాగర్ కర్నూల్: నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండల రైతాంగానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా ( Power Supply ) చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం మహాధర్నా ( Mahadarna ) నిర్వహించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలకు పరిష్కారం చూపడంలో ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు.
పంటలకు నీరు అందించాల్సిన కీలక సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాను పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా విధానాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు.. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే వారి పక్షాన నిలబడి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని గ్రామాల రైతులు, బీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

