Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
Rahul Gandhi : సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు ఇండియా బ్లాక్‌కు చెందిన 11 పార్టీలు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Rahul Gandhi : సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు ఇండియా బ్లాక్‌కు చెందిన 11 పార్టీలు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌కు సుప్రీంకోర్టు రిజిష్టర్ చేసి, విచారణకు స్వీకరించింది. దీని ప్రకారం అక్టోబర్ 26న కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా ఈ పిటిషన్‌కు ఒక రిట్ నెంబర్ రావడంతో, వరుస ప్రకారం విచారణ మొదలవుతుంది. ఈ పిటిషన్‌ను మొదట రాహుల్ గాంధీ, ఆ తర్వాత మరో 11 పార్టీలు కలిసి దాఖలు చేశాయి. ఆ తర్వాత టి.తిరుమవలవన్, సజ్జాద్ అహ్మద్ కిచ్లూ కలిసి పిటిషన్లో చేరారు. దీంతో ఈ పిటిషన్ దాఖలు చేసిన వారి సంఖ్య 13కు చేరింది. భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు, సర్‌లో అవకతవకలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా వంటి అంశాలతో ఈ పిటిషన్ దాఖలైంది.
అయితే, ఈ పిటిషన్లో 14 తప్పులు ఉన్నట్లు సుప్రీంకోర్టు రిజిష్ట్రీ తెలిపింది. దీంతో పిటిషనర్లకు సంబంధించి తగిన ధృవపత్రాలు సమర్పించాలని సంబంధిత న్యాయవాదికి సూచించింది. తగిన కోర్టు ఫీజు (రూ.220) కూడా చెల్లించలేదని తెలిపింది. అనంతరం వీటిని సరిదిద్దడంతో సుప్రీంకోర్టు కేసు రిజిష్టర్ చేసినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

