‘భరోసా’కు నిధుల్లేవు.. సమ్మిట్లకు కోట్లు ఖర్చా?
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని, రైతు భరోసాకు నిధులు లేవని చెప్తూనే.. సమ్మిట్లకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా? అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీత
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని, రైతు భరోసాకు నిధులు లేవని చెప్తూనే.. సమ్మిట్లకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా? అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే క్షేత్రస్థాయికి వెళ్లకుండా, హైదరాబాద్‌లో విందులు, వినోదాలతో సదస్సులు నిర్వహిస్తారా అని నిలదీశారు. ఆరు గ్యారెంటీలు గాలికి వదిలేసి ఆర్భాటపు సదస్సులతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాధనంతో జరిగే ఈ సదస్సుల వల్ల తెలంగాణ సామాన్య ప్రజలకు, రైతులకు ఒరిగేదేమీలేదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.
ప్రజాధనంతో ప్రచార ఆర్భాటాలు, సదస్సులు నిర్వహించడంకంటే ముందుగా ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా వంటి హామీలకు నిధులు కేటాయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు మరోసారి మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో అర్ధరాత్రి అశోక్‌నగర్ వీధుల్లో తిరిగి నిరుద్యోగ యువతకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మూడేండ్లు గడుస్తున్నా ఆ హామీల అమలు ఎకడికి పోయిందో రాహుల్‌గాంధీ తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

