ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల గోడుపట్టని సర్కార్
తెలంగాణ ఆర్టీసీ సంస్థకు దశాబ్దాలపాటు నిస్వార్థంగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన వేలాది మంది కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టింది. వందలాది కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకుండా వారిని గోస పుచ్చుకుంటున్నది.
- 8 ఏండ్లుగా ఆర్థిక ప్రయోజనాల పెండింగ్
- 20వేల మందికి తప్పని ఎదురుచూపులు
- రిటైర్డ్ బెనిఫిట్స్ అందక 400 మందికి పైగా మృత్యువాత
- బస్‌భవన్ చుట్టూ తిరుగలేక కోర్టులను ఆశ్రయించిన వైనం
- ఆర్పీఎస్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్లు చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ సంస్థకు దశాబ్దాలపాటు నిస్వార్థంగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన వేలాది మంది కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టింది. వందలాది కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకుండా వారిని గోస పుచ్చుకుంటున్నది. దీంతో ఆ కార్మికులంతా నేడు తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత అందాల్సిన ప్రయోజనాల కోసం ఏండ్ల తరబడిగా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. దాదాపు 20 వేల మంది రిటైర్డ్ కార్మికులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలు అందకుండానే ఇప్పటికే 400 మందికి పైగా మరణించడం అత్యంత బాధాకరమని వారి కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. రిటైర్డ్ కార్మికులకు అందాల్సిన వేతన సవరణలు, డీఏలు, అలవెన్సులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, వేతన బకాయిలు సహా అనేక ఆర్థిక ప్రయోజనాలను కొన్నేండ్లుగా నిలిపివేయడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. హైదరాబాద్ బస్‌భవన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగాల్సిన దుస్థితి నెలకొన్నదని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
కోర్టులను ఆశ్రయిస్తున్న రిటైర్డ్ కార్మికులు
తాము బతికి ఉండగానే తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందుకొని అనుభవించేందుకు రిటైర్డ్ కార్మికులు న్యాయస్థానాలే శరణ్యమని నమ్ముకుంటున్నారు. సంస్థ అధికారులు పట్టించుకోక, ప్రభుత్వం నిర్లక్ష్యం తోడవడంతో కోర్టులే దిక్కు అని నమ్ముతున్నారు. తమకు రావాల్సిన డబ్బుల కోసం ఆర్టీసీ బస్‌భవన్ చుట్టూ తిరిగినా, ఆందోళనలు చేసినా సంస్థ యాజమాన్యం నుంచి స్పందన కరువైందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీకి వ్యతిరేకంగా ప్రైవేట్ లాయర్లకు సొంత ఖర్చులు భరిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆ అవకాశం రిటైర్డ్ కార్మికులందరికీ లేకపోవడంతో ప్రభుత్వం విడుదల చేసే డబ్బుల కోసమే ఎదురుచూస్తున్నారు. కోర్టుల్లో కేసులు వాదించినా కూడా సకాలంలో డబ్బులు విడుదల చేయలేని దుర్భర పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఉన్నదని కార్మిక నేతలు పేర్కొంటున్నారు.
బకాయిలన్నీ పెండింగ్
ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు సంస్థ చెల్లించాల్సిన బకాయిలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆర్పీఎస్ స్కీమ్ నుంచి 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, ఆర్పీఎస్ 2021 వేతన సవరణ బకాయిలూ అందలేదని చెప్తున్నారు. వేతన సవరణ అనంతరం పెరిగిన జీతాలకు అనుగుణంగా గ్రాట్యుటీ, టెర్మినల్ లీవ్ బెనిఫిట్స్, శాలరీ డిఫరెన్స్కూ దిక్కూమొక్కు లేకుండా పోయిందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఆర్పీఎస్ అమ లు చేస్తే ఆ మేరకు వేతన బకాయిలపై రావాల్సిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను కూడా వెంటనే జమ చేసి, అధిక పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తార్నాక ఆర్టీసీ దవాఖాన వైద్యసేవల పరిమితిని రూ.6 లక్షలకు పెంచాలని వారు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

