ఇష్టమైన వాహనం కొన్నప్పుడే సంతోషం
‘ఇష్టమైన వాహనం కొన్నప్పుడే సంతోషం ఉంటుందని, 1962లో రోడ్డుమీద సైకిల్ కనపడడం ఒక వరం.. మా ఊరికి మేరాయన బట్టలు కుట్టడానికి సైకిల్‌పై వచ్చేవాడు.. అతడి కోసం సాయంత్రం వరకు వేచిచూసేవాళ్లం..
- 1962 సంవత్సరంలో సైకిల్ కొనాలనే కోరిక ఉండేది: మధుసూదనాచారి
- వరంగల్ ఘనంగా ముగిసిన రెండు రోజుల ఆటోషో
- నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ టెస్ట్ డ్రైవ్ చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
నయీంనగర్, నవంబర్ 15 : ‘ఇష్టమైన వాహనం కొన్నప్పుడే సంతోషం ఉంటుందని, 1962లో రోడ్డుమీద సైకిల్ కనపడడం ఒక వరం.. మా ఊరికి మేరాయన బట్టలు కుట్టడానికి సైకిల్‌పై వచ్చేవాడు.. అతడి కోసం సాయంత్రం వరకు వేచిచూసేవాళ్లం.. నేనూ ఒక సైకిల్ కొనుక్కోవాలని ఆనాడే అనుకున్న’ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటో షో గ్రాండ్ సక్సెస్ అయింది. తొలిరోజు శనివారం ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, సందర్శకులతో కిటకిటలాడింది. రెండోరోజైన ఆదివారం కూడా అంతే ఉత్సాహంగా సందర్శకులు పోటెత్తారు.
ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హాజరై స్టాళ్లను సందర్శించారు. పలు రకాల మోడళ్ల కార్లు, బైక్‌లను పరిశీలించి టెస్ట్ డ్రైవ్ చేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఆ రోజుల్లో సైకిళ్లు కనబడితేనే సంబుర పడేవాళ్లమని, వాటి తర్వాత వరంగల్ రోడ్లపై టీవీఎస్ చాంప్‌లు వచ్చాయని గుర్తుచేశారు. ప్రజలకు అనుగుణంగా ఒకే వేదికపై అన్ని రకాల వాహనాలను ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ వారు ఉంచడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో మొదలు పెడితే అనేక రంగాల్లో ‘నమస్తే తెలంగాణ’ ముందున్నదని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి ఇలానే విజయవంతం చేయాలని ఆకాక్షించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ..

ఆటో షోలో సామాన్య ప్రజలకు అనుగుణంగా అన్ని రకాల వాహనాలను అందుబాటులో ఉంచారని, పబ్లిక్‌ను చైతన్యం చేస్తున్న ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు. బైకులు, కార్లు కొనాలనుకునేవారి అవసరాలను గుర్తించి ఒకే వేదికపైకి ప్రముఖ కంపెనీలకు చెందిన వాహనాలు తీసుకొచ్చిన ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’కు సందర్శకులు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధుల ద్వారా వాహన ప్రియులు వివరాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. కొందరు వెంటనే కార్లు, బైక్‌లను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్ కుమార్, ఎడిషన్ ఇన్చార్జి నల్లపురి విద్యాసాగర్, బ్యూరో ఇన్చార్జులు పిన్నింటి గోపాల్, నూర శ్రీనివాస్, యాడ్స్ మేనేజర్ అప్పని సూరి, సర్యులేషన్ మేనేజర్ ఏడెల్లి సురేశ్‌రెడ్డి, నమస్తే తెలంగాణ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

