హరీశ్‌రావు తండ్రి సంవత్సరీకానికి కేసీఆర్
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు సంవత్సరీకానికి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు.
- సత్యనారాయణరావు చిత్రపటానికి ఘన నివాళి
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు సంవత్సరీకానికి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన కేసీఆర్.. హైదరాబాద్ కోకాపేటలోని హరీశ్‌రావు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు.
తదనంతరం వారితో కలిసి భోజనం చేశారు. సత్యనారాయణరావుతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. కేసీఆర్ సతీమణి శోభమ్మ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, కొడుకు హిమాన్షు, రాజ్యసభ సభ్యుడు, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు తదితరులు హాజరై సత్యనారాయణరావు చిత్రపటానికి నివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

