బోనకల్లు, సెప్టెంబర్ 08 : బోనకల్లు మండలంలోని మోటమర్రి సహకార సంఘం పరిధిలోని రెండు గ్రామాల రైతులు సోమవారం యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. సహకార సంఘ పరిధిలోని రైతాంగం యూరియా కోసం సహకార సంఘం వద్దకు పెద్ద ఎత్తున వచ్చింది. ఈ సహకార సంఘానికి కేవలం 230 బస్తాల యూరియా మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. రైతులు సుమారు 400 మంది వచ్చారు. వచ్చిన యూరియాను మండల వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో సీరియల్ ప్రకారం ప్రతి రైతుకు ఒక్క యూరియా కట్టను మాత్రమే అందించారు. మళ్లీ వచ్చిన తర్వాత మిగిలిన రైతులకు యూరియాని అందిస్తామని వ్యవసాయ విస్తరణ అధికారి నాగసాయి తెలిపారు.