ఆత్మకూరు: యూరియా (Urea) కోసం అన్నదాతలకు అవస్తలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు వెంటాడుతున్నాయి. గత 25 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు. సూర్యాపేట (Suryapet) జిల్లాలో ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయానికి యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు.. సోమవారం తెల్లవారు జామునే అక్కడికి చేరుకున్న రైతులు క్యూకట్టారు. పీఏసీఎస్ ఆవరణలో పెద్ద ఎత్తున వర్షం నీరు వస్తున్నప్పటికీ లైన్లలో వేచి ఉన్నారు.