న్యూఢిల్లీ : రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. రైతుల కోసం కేంద్రం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతులు నవంబర్ 26న ఢిల్లీకి చేసిన చారిత్రక ప్రదర్శనకు ఐదేండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎస్కేఎం తెలిపింది.
ఢిల్లీ సరిహద్దు సమీపంలో సంవత్సరం పాటు బైఠాయించిన అన్నదాతలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా కేంద్రం ఇప్పటి వరకు నెరవేర్చలేదని సంస్థ అధ్యక్షుదు అశోక్ దవాలే తెలిపారు. నవంబర్ 26న దేశ వ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా స్థాయి కేంద్రాలలో నిరసనలు నిర్వహించాలని ఆయన రైతులను కోరారు.