తుంగతుర్తి, సెప్టెంబర్ 22 : తెలంగాణ రైతాంగానికి 12 గంటలు కరెంటు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి మండలం మంచ్య తండాలో గిరిజన రైతులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ అందించి పంట పొలాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వానాకాలం పంటలను కాపాడేలా విద్యుత్ సరఫరా పెంచి రైతులను ఆదుకోవాలన్నారు. పరిపాలన గాలికి వదిలేసి కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకుల భూములపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లాకావత్ చెంద్రునాయక్, లాకావత్ భిక్షం నాయక్, మోతీలాల నాయక్, సోమ్లా నాయక్, ఇమలు నాయక్ పాల్గొన్నారు.