అర్వపల్లి, ఏప్రిల్ 15 : ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని అర్వపల్లి తాసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లోయపల్లి, సూర్యనాయక్ తండా, కాసర్లపహాడ్, అర్వపల్లి, పర్సాయపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు మద్దతు ధర లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జలేoదర్, సీసీలు యాదగిరి, నాగార్జున, సర్పంచులు వల్లపు గంగయ్య, కేలోతు కాంతమ్మ హరిలాల్, లూనావత్ కృష్ణ, మంచాల లలిత రామూర్తి, చిల్లంచర్ల విద్యాసాగర్, అవిలయ్య, మహేశ్, సెంటర్ నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.