అర్వపల్లి, మే 07 : రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి సెంటర్లను తెరచి 40 రోజులవుతున్నా, రైతులు సెంటర్లకు ధాన్యాన్ని తెచ్చి 50 రోజులవుతున్నా కాంటాలు కాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే కాంటాలు పెట్టి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్లను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి రైతుల ఆవేదనను ఆలకించి మాట్లాడారు. ఐకెపి సెంటర్లలో పోసిన ధాన్యం సుమారు 50 రోజులవుతున్నా కాంటాలు పెట్టక వాతావరణ పరిస్థితులు అకాల వర్షాలు వస్తున్న సందర్భంగా ఆరుగాలం కష్టం చేసి పండించిన వడ్లకు కోనే దిక్కులేక పరిస్థితి తట్టుకోలేని రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరితో మిల్లర్లు సెంటర్ నిర్వాహకుల అవకతవకుల కారణంగా ఆలస్యమవుతుందని విచారణ వ్యక్తం చేశారు. రైతే రాజు అని చెప్పుకుంటూ కనీసం రైతుల వైపు కానీ రైతు పండించిన పంట వైపు గాని చూడకుండా కాలయాపన చేస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేసే స్థితిలో లేదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే కాంటాలు వేగవంతం చేసి వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెబుతూ కనీసం రైతు పండించిన పంటను కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నదని అధికారులు మిల్లర్లు కలిసి రైతులను మోసం చేసి దగా చేస్తూ ఒడ్లు బాగాలేవని తక్కువ చేసి దిగుమతి చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు విషయంలో వెంటనే కాంటాలు పెడుతున్నామని చెబుతున్నా దానికి విరుద్ధంగా ఐకెపి సెంటర్లో రైతులు ఎండలో మంచినీరు లేక ధాన్యాన్ని పట్టాలు కిరాయి తెచ్చుకుని ఎన్నో రోజులు అవుతున్నా కాంటాలు పెట్టక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా స్పందించి పది రోజుల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు డబ్బు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, నమ్మాలి వెంకటేశ్వర్లు, కోట గోపి, పులుసు సత్యం, బుర్ర శ్రీనివాస్, కందాల శంకర్ రెడ్డి, వజ్జ శ్రీనివాస్, గండ వెంకట్ రెడ్డి, రజిత, సంపత్, వెంకన్న, నిమ్మల కోటి, అబ్బులు, కొమ్ము విజయకుమార్, బొడ్డు సైదులు, కనుక మల్లేష్, కోటమర్తి సుజాత, దేవులపల్లి వీరారెడ్డి, మర్రి సైదులు, సంపత్ రాజు, సైదయ్య, వీరయ్య, సాయికుమార్, రామావత్ రాములు, ఎల్లవుల ఆవులయ్య, శిఖ రవికుమార్, మద్ది రాజయ్య, బొల్లం గోపయ్య, అరిగ వీరస్వామి, రావుల వెంకన్న, వినయ్ కుమార్, కొప్పు సరోజ, బొల్లం జానయ్య, సిగ శ్రీనివాస్, పనస భద్రయ్య పాల్గొన్నారు.