మద్దూర్, సెప్టెంబర్11 : సీఎం ఇలాకాలో రైతులంటే ఇంత నిర్లక్షమా? అంటూ అధికారులపై మద్దూర్ మండలం నాగిరెడ్డిపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రైతులంతా కలిసి నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ భూ పరిహారంపై తహసీల్దార్ మహేశ్‌తో కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం మాత్రమే ఇస్తామంటే భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఇక్కడ ఉన్న భూముల విలువ ఎకరాకు రూ.60 లక్షల వరకు ఉంటుందని, అందుకు తగ్గ పరిహారమే ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం తప్ప ఇష్టమున్నట్టు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొందామంటే ఒప్పుకొనేది లేదని తెగేసి చెప్పారు.