ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీమేకర్స్ తొలిసారి హారర్ జానర్లోకి అడుగుపెట్టింది. అగ్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్ సమర్పణలో వారు నిర్మిస్తున్న ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ ‘418’. కీర్తన్ నాదగౌడ దర్శకుడు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ని శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. ‘ఈ పాడుబడిన ఇంట్లోకి ఓ పక్షి కూడా వెళ్లలేదు’ అని వాచ్మెన్ చెప్పడంతో ట్రైలర్ మొదలైంది.
15ఏండ్లుగా మూసి ఉన్న ఆ బిల్డింగ్‌ని స్థానికుల వ్యతిరేకత ఉన్నప్పటికీ తిరిగి తెరవడం.. ఆ బిల్డింగ్‌లోని రూమ్ నంబర్ 418లో భయంకరమైన రహస్యం దాగి ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేయడం.. దేవిక ఎంట్రీ.. ట్రైలర్లో ఉన్న ఈ అంశాలన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. రియాలిటీకి, హ్యాలుసినేషన్స్కి మధ్య చిక్కుకున్న వివేక్ పాత్ర కథలో కీలకమని తెలుస్తున్నది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో ఓ భయానక ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ట్రైలర్ సాగింది. చైత్ర ఆచార్ ట్రైలర్లో హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ దివాకర్, సంగీతం: వెంకీ జీజీ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్.