కారేపల్లి, సెప్టెంబర్ 22 : ఆర్ధిక ఇబ్బందులతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కారేపల్లి మండల పరిధిలోని మంగళితండా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళితండా గ్రామానికి చెందిన రైతు ధరావత్ పంతులు తనకున్న 4 ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, వరి పంటలు సాగు చేస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు అధికం కావడంతో మనస్థాపం చెందిన పంతులు ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.