మాగనూరు కృష్ణ : మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండల పరిధిలోని వద్ద గుర్తుతెలియని ( Unidentified Body) వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్సై నవీద్ ( SI Naveed ) వివరాల ప్రకారం.. చెక్‌పోస్టు బ్రిడ్జి సమీపంలో రోడ్డు ఎడమ డివైడర్ పక్కన ఓ గుర్తు తెలియని మగ పురుషుని శవం పడి ఉందని గుడెబల్లూరు గ్రామపంచాయతీ సెక్రెటరీ రఘు స్వామి సమాచారం అందించారని తెలిపారు.
సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా డీకంపోజైన 30 నుంచి 35 సంవత్సరాల యువకుడిగా గుర్తించామన్నారు. మృతుడి ఒంటిపై నల్లని పాయింట్, డార్క్ బ్రౌన్ కలర్ ఫుల్ షర్ట్, డ్రాయర్ ధరించి ఉన్నాడని వివరించారు. ఘటన స్థలం వద్ద ఎలాంటి ఆదారాలు లభించలేదని పేర్కొన్నారు. సెక్రటరీ రఘు స్వామి ఫిర్యాదు మేరకు ఎఫ్ఆర్ఐ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.