నార్నూర్ : మండల అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో పుల్లారావు ( MPDO Pullarao) అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోను బీఆర్ఎస్ నాయకులు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు, సంక్షేమ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో ప్రభాకర్, ఈజీఎస్ ఏపీవో రాథోడ్ సురేందర్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, మాజీ సర్పంచ్ మడావి రూప్ దేవ్, నాయకులు రాథోడ్ సుభాష్, చౌహాన్ యశ్వంత్ రావ్ తదితరులున్నారు.