Vangalapudi Anitha | తప్పుడు పోస్టులు పెడితే సహించం.. ఏపీ హోంమంత్రి అనిత వార్నింగ్
Vangalapudi Anitha | సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే సహించబోమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. కల్పిత వీడియోల ద్వారా చాలామంది ఇబ్బంది పెడుతున్నారని.. అలాంటి వాటిని ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు.
Vangalapudi Anitha | సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే సహించబోమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. కల్పిత వీడియోల ద్వారా చాలామంది ఇబ్బంది పెడుతున్నారని.. అలాంటి వాటిని ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ లారీపై రాళ్లు వేసిన వీడియోను.. ఏపీలో జరిగినట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వార్తలను ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు పోలీసులకు అత్యాధునిక సాంకేతికతను అందజేస్తామని తెలిపారు.
తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని ఇవాళ అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆఫీసును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కార్యాలయం పూర్తి కాకుండా ఉందన్నారు. పోలీసులు వ్యవస్థను బలోపేతం చేసేందుకు డీజీపీ కృషి చేస్తున్నారని అన్నారు. పోలీసులకు కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. పోలీసులకు కోటి రూపాయల బీమా కూడా అందిస్తున్నామని అన్నారు. అదే వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగంకూడా ఇవ్వలేదని విమర్శించారు. పోలీసు చనిపోతే.. వారి కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

