న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌ను ఇండియన్ మహిళ జట్టు(Women’s Cricket World Cup) గెలిచిన విషయం తెలిసిందే. అయితే భారతీయ మహిళా జట్టును ప్రధాని మోదీ బుధవారం సత్కరించనున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని బృందం.. ముంబై నుంచి ఢిల్లీకి ఇవాళ పయనమైంది. ప్రధాని మోదీ ఆఫీసు నుంచి సోమవారం ఆలస్యంగా ఇన్విటేషన్ అందినట్లు తెలుస్తోంది. గతంలో మెన్స్ జట్టుకు సన్మానం జరిగిన తీరులో ఈ వేడుకను నిర్వహించనున్నారు. బార్బడోస్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ సేన జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని మోదీని కలిసిన తర్వాత భారత జట్టు ముంబైలోని మెరైన్ డ్రైవ్ మార్గంలో విక్టరీ పరేడ్ నిర్వహించారు. వరల్డ్‌కప్ గెలిచిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. మహిళా బృందానికి 51 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది.