CM Revanth Reddy | సంవత్సరానికి లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు సర్టిఫికేట్స్ తీసుకొని బయటకు వస్తున్నారు. మీరు ఆ పిల్లలను అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగానికి అప్లికేషన్ నింపమని ఇయ్యండి.. వారికి కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం కూడా రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ MCRHRD ప్రాంగణంలోని దాశరథి ఆడిటోరియంలో ఫిన్లాండ్, జర్మనీ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ప్రతినిధులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నేను మీ టీచర్లకు చెబుతున్నా. మీరు వాళ్లను పిలిచి ఇంజినీరింగ్ సర్టిఫికెట్లను తీసుకొచ్చి.. మీరు చదువు చెబుతున్న ఊరిలో ఉన్న పిల్లలను పిలిపించి తెల్ల కాగితాన్ని ఇచ్చి జాబ్ కోసం అప్లికేషన్ నింపమనండి. ఇది క్రిమినల్ వేస్ట్.. వాడు ఇంజినీరింగ్ చదువుకున్నా అని చిన్న జాబ్‌కు పోడు. స్క్రిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులేమో మా కొడుకు ఇంజినీరింగ్ అయిపోయింది.. ఉద్యోగం అంటరు.. నియోజకవర్గంలో నా దగ్గరకు వస్తుంటరు. మావోడు ఇంజినీరింగ్ చదివిండు.. పెద్ద పెద్ద చదువులు చదివిండు సార్ అంటరు తల్లిదండ్రులకు తెలియదు కదా.. అని చెప్పుకొచ్చారు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి.
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్
వారికి కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం కూడా రాదు
సంవత్సరానికి లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/GOTxohpomi
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2026
Municipal Commissioner | భద్రకాళి బండ్‌పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి : బల్దియా కమిషనర్
Punjab Paper Leaks | పంజాబ్‌లో వరుస పేపర్ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు