టెహరాన్, జూన్ 23: ఇరాన్‌లోని అణు పరిశోధనా కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులపై ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ సోమవారం స్పందించారు. ఇజ్రాయెల్‌కి తాము విధించిన శిక్ష కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ‘ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసింది. పెద్ద నేరానికి పాల్పడింది. దాన్ని శిక్షించాల్సిందే.. శిక్ష కొనసాగుతోంది’ అని ఖమేనీ తెలిపారు. అమెరికా వైమానిక దాడులుగా కనిపిస్తున్న ఫొటోలను కూడా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. ఆ ఫొటో మధ్యన ఓ పుర్రె బొమ్మ ఉంది. దాని నుదుటిపైన స్లార్ ఆఫ్ డేవిడ్ అని రాసి ఉంది. ఇది యూదులకు సంబంధించిన చిహ్నం. అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత అత్యంత శక్తివంతమైన భాంబును తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్న భారీ క్షిపణిని ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించిన కొన్ని గంటల్లోనే ఖమేనీ ఈ ప్రకటన చేశారు.
ఈ యుద్ధానికి ముగింపు మేమే పలుకుతాం
అమెరికాపై ప్రతీకార చర్యలు ఉంటాయని ఇరాన్ సైన్యం సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ‘గ్యాంబ్లర్ ట్రంప్.. మీరు యుద్ధాన్ని ప్రారంభించవచ్చు కాని దాన్ని ముగించేది మాత్రం మేమే’ అని ఇరాన్ సైనిక సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి ఇబ్రహిం జోల్ఫాఘరి హెచ్చరించారు.
ఖమేనీకి ‘రహస్య’ విభాగం భద్రత!
ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కి ఎవరికీ తెలియని అత్యంత రహస్య భద్రతా విభాగంతో ఖమేనీకి భద్రత కలిస్తున్నట్టు సమాచారం.