హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దేవాలయ భూములను కాపాడాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మంత్రి కొండా సురేఖను కలిసి వినతిపత్రం అందజేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలో దేవాదాయ శాఖకు సంబంధించిన సుమారు మూడు ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తు లు అక్రమంగా తమ పేరు మీదకు మార్చుకున్నారని న్యాయవాదులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఆ భూమిలో వెంచర్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ భూమిని కాపాడి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో న్యాయవాది కారుపోతుల రేవంత్, న్యాయ విద్యార్థి చెలిమల మణివర్ధన్ తదితరులు ఉన్నారు.