నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 27 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి పరిధిలోని 23 మండలాల్లోని 555 జీపీలు, 4952 వార్డులకు ఎలక్షన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి రోజైన గురువారం సర్పంచ్ స్థానాలకు 474, వార్డులకు 249 నామినేషన్లు దాఖలయ్యాయి.
మూడు మండలాల్లోని 48 సర్పంచ్, 420 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, మొదటి రోజు గురువారం సర్పంచ్ స్థానాలకు 22, వార్డులకు 20 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌లకు ఏటూరునాగారం మండలంలో 12కు 4, గోవిందరావుపేటలో 18కు 2, తాడ్వాయిలో 18కు 16 నామినేషన్లు పడ్డాయి.
మూడు మండలాల్లోని 69 సర్పంచ్, 658 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ స్థానాలకు 86, వార్డులకు 61 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌లకు ఎల్కతుర్తి మండలంలో 20కి 20, భీమదేవరపల్లిలో 25కు 30, కమలాపూర్‌లో 24కు 36 నామినేషన్లు పడ్డాయి.
నాలుగు మండలాల్లోని 82 సర్పంచ్, 712 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ స్థానాలకు 45, వార్డులకు 35 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌లకు గణపురం మండలంలో 17కు 6, మొగుళ్లపల్లిలో 26కు 17, రేగొండలో 23కు 15, గోరికొత్తపల్లిలో 16కు 7 నామినేషన్లు పడ్డాయి.
మూడు మండలాల్లోని 91 సర్పంచ్, 800 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ స్థానాలకు 101, వార్డులకు 37 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌లకు వర్ధన్నపేట మండలంలో 18కు 22, పర్వతగిరి 33కు 34, రాయపర్తిలో 40కు 45 నామినేషన్లు పడ్డాయి.
ఐదు మండలాల్లోని 110 సర్పంచ్, 1024 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ స్థానాలకు 107, వార్డులకు 40 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌లకు స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో 15కు 17, చిల్పూర్‌లో 17కు 17, జఫర్‌గఢ్‌లో 21కు 23, రఘునాథపల్లిలో 36కు 35, లింగాలఘనపురంలో 21కు 15 నామినేషన్లు పడ్డాయి.
ఐదు మండలాల్లోని 155 సర్పంచ్, 1338 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ స్థానాలకు 113, వార్డులకు 56 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌లకు మహబూబాబాద్ మండలంలో 41కి 20, గూడూరులో 41కు 28, కేసముద్రం 29కు 21, నెల్లికుదురులో 31కు 30, ఇనుగుర్తి మండలంలో 13కు 14 నామినేషన్లు పడ్డాయి.