కంది, నవంబర్ 27: ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల పరిశీలకుడు, ఐఎఎస్ అధికారి పి.ఉదయ్‌కుమార్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంగారెడ్డి జిల్లాకు ఇద్దరు అధికారులను పరిశీలకులుగా నియమించింది.
గురువారం కంది మండలం కౌలంపేట్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పరిశీలకుడు పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు జి.రాకేశ్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసాపై నిఘా ఉంచాలన్నారు. నిబంధనల మేరకు పారదర్శకంగా నడుకోవాలన్నారు. వారివెంట ఎంపీడీవో శ్రీనివాస్ ఉన్నారు.