
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఉత్తమ వైద్యసేవలందిస్తున్నట్లు మంగళవారం తెలిపారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో సోమవారం చేరారు.
Followed up on Dr Manmohan Singh Ji’s health with the medical team attending to him at AIIMS, Delhi. His condition is stable.
— Dr Harsh Vardhan (@drharshvardhan) April 20, 2021
Best possible care is being provided to him. We all pray for his quick recovery.
88 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఇప్పటికే రెండో డోసుల టీకా వేయించుకున్నారు. తొలి డోసు మార్చి 4న వేయించుకోగా.. రెండో డోసును ఏప్రిల్ 3న తీసుకున్నారు. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితిపై గత ఆదివారం మన్మోహన్ సింగ్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఆర్డర్ల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి పలు సలహాలను సైతం సూచనలు చేసిన విషయం తెలిసిందే.