Health tips : ఈ ఉరుకులు, పరుగుల జీవితాల్లో వండుకుని తినడానికి కూడా సమయం ఉండటం లేదు. సంపాదన రేసులో పడి ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిస్తున్నారు. దాంతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు (Health issues) తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే జనాల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. చాలామంది ఆయుర్వేద విధానాలను, వంటింటి చిట్కాల (Kicthen tips) ను పాటిస్తున్నారు. వంటింట్లో లభించే పసుపు (Turmeric powder), తేనె (Honey) తో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడంవల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు, తేనె మిశ్రమం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ మిశ్రమం సహజసిద్ధమైన లాక్సేటివ్ ఏజెంట్‌గా పనిచేస్తుందట. ఇది సుఖ విరోచనానికి దోహదపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలైన కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. పసుపు, తేనెలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. కణాలను రక్షిస్తాయి. పసుపు, తేనె కలిపి తీసుకోవడంవల్ల ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. అలాగే సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కల్పించడంలో పసుపు, తేనె మిశ్రమం తోడ్పడుతుంది.
ఒక గ్లాస్ నీళ్లలో తగినంత పసుపు, తేనె కలిపి రోజూ ఉదయాన్నే తాగాలి. ఈ మిశ్రమం చర్మాన్ని లోపల నుంచి శుభ్రపరిచి ప్రకాశవంతంగా చేస్తుంది. లోపల నుంచి జరిగే డీటాక్సిఫికేషన్ వల్ల ముడతలు, మొటిమలు లాంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ మిశ్రమంలో జీవక్రియ వేగాన్ని పెంచే గుణం ఉంది. ఆకలిని నియంత్రణలో ఉంచి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పసుపు, తేనె వేర్వేరుగా ఒకదానికొకటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. అలాంటి వాటిని కలిపి తీసుకున్నప్పుడు అది శరీరానికి రెండు రెట్లు లాభం చేస్తుంది. ప్రతి రోజు ఉదయం దీన్ని తీసుకునే అలవాటు చేసుకుంటే కేవలం 15 రోజుల్లోనే మీ శరీరంలో తేడాలను గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.